తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు యుద్ధ ప్రాతిపదికను తీసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర,కొర వర్షాలతో చెత్తాచెదారం మురిగిపోయి దోమలు పెరిగి విష జ్వరాల బారిన ప్రజలు పడే ప్రమాదం ఉందని మునిగడప హెచ్చరించారు. తక్షణమే మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా కాలువలపై దోమల మందు పిచికారి చేయాలని, చెత్త తొలగించిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అదేవిధంగా దోమల నివారణ పొగ కొట్టాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రామవరం వ్యాప్తంగా కోతులు, కుక్కలు బెడద తీవ్రంగా ఉందని తక్షణమే వాటి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ