తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ మరియు ఉమెన్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం జమ్ము కాశ్మీర్లోని పేహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచికంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమరవీరుల స్థూపం వద్ద మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. SGF ఉమెన్స్ గిల్డ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న, వీధుల్లో ఆశ్రయం పొందుతూ జీవనం సాగిస్తున్న వారికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎస్ జి ఎఫ్ ఉమెన్స్ గిల్డ్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నూరి మెహరున్నీసా, ప్రధాన కార్యదర్శి చిట్టిమళ్ళ శ్వేత, కోశాధికారి సోనా, ఉపాధ్యక్షురాలు జరీనా, కోఆర్డినేటర్ మేకల జ్యోతిరాణి, ముఖ్య ప్రతినిధులు నసీం పాషా ,అంజమ్మ, కళ్యాణి , SGF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఖాసిం, కోశాధికారి చిట్టిమల్ల బ్రహ్మం తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ