Tuesday, 28 July 2026 11:09:57 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి. పాటిల్‌

Date : 08 October 2025 05:34 PM Views : 258

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ వంటి అంశాలపై ఆయన అదనపు కలెక్టర్‌ డి. వేణుగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తన బాధ్యతను కట్టుదిట్టంగా, సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎంసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు సెన్సిటివ్‌ మరియు హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలను గుర్తించి సంబంధిత పోలీస్‌ అధికారులకు తెలియజేయాలని సూచించారు. మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు వంటి ప్రక్రియలపై సంబంధిత సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థులు తమ నామినేషన్‌ ఫారాలను ముందుగానే తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. రిటర్నింగ్‌ ఆఫీసర్లు స్వీకరించిన నామినేషన్లను అదే రోజు Te-Poll సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ప్రతి రోజు సాయంత్రం నాటికి రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. తహసీల్దార్లు (మండల MCC నోడల్‌ అధికారులు) SST, FST బృందాల నివేదికలను సేకరించి జిల్లా నోడల్‌ అధికారులకు పంపాలని సూచించారు. ZPTC నామినేషన్ల ప్రక్రియ సంబంధిత RDO / సబ్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బ్యాలెట్‌ పేపర్‌ తయారీ మరియు ముద్రణను తెలుగు వర్ణమాల క్రమంలో ఖచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. పోలింగ్‌ సామాగ్రిని కేంద్రాల వారీగా వేరు చేసి భద్రంగా ఉంచాలని ఎంపీడీఓలను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ర్యాలీలు, సమావేశాలు, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి సంబంధించి SHO / CI ల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్‌ సూచించారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్‌ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి అక్టోబర్‌ 11వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు జరగనుంది. అక్టోబర్‌ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 13న అప్పీల్‌ స్వీకరణ, అక్టోబర్‌ 14న అప్పీల్‌ విచారణ జరగనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అక్టోబర్‌ 15వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉండగా, అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వివరించారు.జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా, సమన్వయంతో నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నోడల్‌ అధికారులు అన్ని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :