తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో మంగళవారం ఉరుములతో కూడిన భారీ ర్షం కురిసింది. కాగా గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు యువతులు సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (23) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మరో మహిళా మడకం సీతమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నారు. జగ్గారంలో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేల్లో పనులకు వెళ్ళిన కూలీల సమీపంలో పిడుగుపాటు పడిందన్నారు. సీతమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ