తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంచినీళ్లు అనుకుని దోమల మందు తాగి మరణించిన ఓదెమ్మ కుటుంబానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తక్షణసాయంగా 3 లక్షలు, కర్మకాండలకు 10,000 అందిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ నిధుల నుండి తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా అదనపు ఆర్థిక సాయం సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పక్కాగృహం ఇస్తామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ