తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు శ్రమదానం కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమిష్టి భోజనం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్యాలయంలోని అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కలిసి సమిష్టిగా భోజనం చేసి ఐక్యతను ప్రదర్శించారు. అనంతరం శ్రమదానం కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసరాలను సిబ్బంది అందరూ కలిసి శుభ్రపరిచారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు కార్యాలయ సిబ్బంది మధ్య ఐక్యత మరియు సహకారం మరింత బలపడింది.
Admin
తెలుగు వెలుగు టీవీ