Tuesday, 28 July 2026 03:37:11 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు.

Date : 27 July 2026 06:45 PM Views : 37

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం.నిరంతర శ్రమ, అంకితభావంతోనే సంస్థ పురోగతి సాధ్యం.ఏరియా వర్క్‌షాప్ ప్రణాళికాబద్ధమైన పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు.బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయమని, ఉద్యోగుల నిరంతర శ్రమ, అంకితభావంతోనే సింగరేణి సంస్థ పురోగతి సాధ్యమవుతోందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు తెలిపారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్న సందర్భంగా కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్‌లో సోమవారం ఆయనకు అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కలిసి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం షాలెం రాజు మాట్లాడుతూ.. వర్క్‌షాప్‌లో పనిచేసే టెక్నీషియన్లు, సూపర్‌వైజర్లు, అధికారులు రాత్రింబవళ్లు కష్టించి పనిచేయడం వల్లే కొత్తగూడెం ఏరియా బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. అంతకుముందు జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రామవరం ప్రాంతానికి చెందిన షాలెం రాజు అండర్ మేనేజర్‌గా ప్రస్థానం ప్రారంభించి, క్రమశిక్షణతో జీఎం స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం ఆయనను శాలువాలు, పూలమాలలతో వైభవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారుల ప్రతినిధులు గోవింద రావు, రామకృష్ణ, క్రిస్టోఫర్, కార్మిక సంఘాల నాయకులు మధు కృష్ణ, సత్తార్ పాషా, గుమ్మడి వీరయ్య, మెంగని రోషన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :