తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలోని పడమటి నర్సాపురం పంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ లక్ష్మీ కుమారి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని, గ్రామ పెద్దల సహకారంతో మండలంలోని నరసాపురం గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయితీగా చేస్తానని, శక్తి వంచన లేకుండా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఉప సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం మరుగున పడిన రహదారి పనులను అభివృద్ధి చేయడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బి.హారిక, రామాలయ కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు యువకులు తదితరులు
Admin
తెలుగు వెలుగు టీవీ