Tuesday, 28 July 2026 03:58:21 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలి – కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 31 July 2025 08:19 PM Views : 533

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలు, శుభ్రత, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆపరేషన్ గది మరియు లేబర్ రూమును కలెక్టర్ పరిశీలించి ఆపరేషన్ గదిలో మందులు నిల్వ ఉండటాన్ని గమనించి ఇక్కడ ఎందుకు నిల్వ చేశారు, ఆపరేషన్ థియేటర్ ఉపయోగిస్తున్నారా లేదా అని వైద్యులను ప్రశ్నించారు. వైద్యులు మూడు నెలలకు సంబంధించి మందులను ముందుగా నిల్వ చేసినట్లు తగిన ప్రదేశం లేక ఇక్కడ నిల్వ చేసినట్లు వివరించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సిబ్బందిని అభినందించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పెరగాలి అని పేర్కొన్నారు.ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తమ విధుల్లో నిబద్ధతతో, సమయపాలన పాటిస్తూ సేవలందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రిలో రోగుల కోసం అవసరమైన రక్తపరీక్షలు, సీజనల్ వ్యాధుల నివారణకు మందుల సరఫరా, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ఉన్నందున తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రజల ఆరోగ్యం సంరక్షణలో ఆరోగ్య కేంద్రాల పాత్ర కీలకమని అన్నారు. ఆసుపత్రి రికార్డుల నిర్వహణ, వైద్య సేవల నాణ్యత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నాటిన మునగ, కరివేపాకు మరియు ఉసిరి చెట్లను కలెక్టర్ పరిశీలించి ఇంకా మిగతా ఖాళీ ప్రదేశంలో కూడా ఈ మొక్కలను నాటాలని సూచించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :