తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ ఆర్మీకి మద్దతుగా క్రీడాస్ఫూర్తితో సంఘీభావం తెలిపేందుకు జవాన్ కప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని టి.యూ డబ్ల్యూ.జే ( ఐ.జే.యూ ) యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం నుండి నాలుగు రోజులపాటు ప్రకాశం స్టేడియంలో మీడియా లెవెన్ జట్టు ఆధ్వర్యంలో నిర్వహించే జవాన్ క్రికెట్ టోర్నీలో పాల్గొని మీడియా లెవెన్ జట్టు సభ్యులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనకోసం , రేపటి తరాల మన భవిష్యత్తు కోసం వారి ప్రాణాలు లెక్కచేయకుండా మన భారతదేశాన్ని కాపలా కాస్తూ విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లకు పాదాభివందనాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ పహల్గామ్ లోని పర్యాటకుల పై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైన్యం పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిన సందర్భంగా భారత జవాన్లకు మద్దతుగా కొత్తగూడెం మీడియా లెవెన్ జట్టు క్రీడాస్ఫూర్తితో సంఘీభావం ప్రకటించడం అభినందనీయమన్నారు. భారత జవాన్లను గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీలో గెలుపొందిన ప్రైజ్ మనీ సైతం జవాన్లకు అంకితం చేయాలన్న ఆలోచన చాలా మంచిదన్నారు. ఇదేవిధంగా మన ఇండియన్ క్రికెట్ లీగ్ ఐ.పి.ఎల్ కూడా ఇండియన్ ఆర్మీ కి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరారు. అదేవిధంగా క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ముందుగా పహల్గామ్ లో ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మీడియా 11 జట్టు ఆధ్వర్యంలో భారత జవాన్ల కు మద్దతుగా సహాయ నిధిని ఏర్పాటు చేసిన క్రమంలో సహాయ నిధిని ప్రారంభించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ