తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం వన్నందాస్ గడ్డ శాఖ వన్ సిపిఐ కార్యదర్శి సూరిమేనేని జనార్ధన్ మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని కొత్తగూడెం శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాష లు ఆవేదన వ్యక్తం చేశారు. వన్నం దాస్ గడ్డ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపిల అధ్యక్షతన ఏర్పాటుచేసిన సంస్మరణ సభలోవారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి సిపిఐ శాఖ సెక్రెటరీగా కొనసాగుతూ అనేక ఒడిదుడుకులు ఎదురైన తను నమ్మిన సిద్ధాంతం కోసం ,తానున్న ప్రాంతంలో పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన సూరీమేని జనార్ధన్ అభినందనీయుడని అలాంటి వ్యక్తి మరణం ఆయన కుటుంబానికె ఈ ప్రాంత,పార్టీకి తీరని లోటని వారు అన్నారు. ఆయన నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం మనమందరం కట్టుబడి ఉండి ఆయన ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళులు అని అన్నారు. అనంతరం ఆయన స్నేహితులు సూరినేని కుటుంబానికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ చేసిన పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించారు. సూరి మేని జనార్ధన్ కుటుంబం అంటే ఇది కమ్యూనిస్టు కుటుంబమని, కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ఆ కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉంటుందని వారికి ఎలాంటి ఆపదలు కష్టాలు వచ్చినా అండగా నిలుస్తుందని ఈ ప్రాంత కమ్యూనిస్టు నాయకులు వారి కుటుంబాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సరిగంటి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జములయ్య, ఫయుం, జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, మునిగడప పద్మ, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి కృష్ణ, ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్, రామారం బ్రాంచ్ డివిజన్ కార్యదర్శి మండల రాజు, సహాయ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ యూసఫ్, బోయిన విజయ్, సత్యనారాయణ చారి, సీనియర్ నాయకులు టూ ఇంక్లైన్ శాఖ కార్యదర్శి మహమ్మద్ అంకుష్, సర్పంచ్ గుగులోత్ నగేష్, ఉప సర్పంచ్ సింగిరాల రమేష్, ఆది మల్లయ్య, బయ్యన ఈశ్వరయ్య, దాట్ల శ్రావణ్, కొరిమి సురేష్,, సావటి స్వామి, ఖయ్యుం, ఎస్కే జలీల్, మర్రి కృష్ణ, తొగరునరేందర్, కమల్, జి శంకర్, గంటాడి కోటేశ్వరరావు, అజ్మీరా బాలాజీ నాయక్, అల్లకొండ గోపి, దిలీప్, ఎర్రవల్లి శంకర్, మహిళా సంఘం నాయకురాలు కే,రత్నకుమారి, మహబూబి,షాహిన్, మద్దెల విజయలక్ష్మి కైసర్, కుటుంబ సభ్యులు సూరిమేని రామారావు, సూరి మేని భాను ప్రకాష్, స్నేహితులు దిండిగాల సాయిలు, శంకర్,
Admin
తెలుగు వెలుగు టీవీ