తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 2 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లులు అందించాలని సిపిఎం, ఆధ్వర్యంలో అర్హులైనటువంటి గ్రామస్తులు ధర్నా చేశారు.గ్రామ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనర్హులకు ఇల్లులు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అర్హులైన వారికి తక్షణమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, మిషన్ భగీరథ నీళ్ళ సమస్య తీర్చాలని, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, రైతులందరికీ రుణమాఫీ తక్షణమే చేయాలని లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ