తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గంజాయి కేసులతో సంభందం ఉన్న వ్యక్తులకు ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో డిఎస్పీ రెహమాన్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కేసులతో సంభంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు తన కార్యాలయంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ గంజాయి కేసులలో సస్పెక్ట్ షీట్స్ తెరవబడి ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా పెట్టడం జరిగిందని అన్నారు. గతంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం,సేవించడం వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోని వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కష్టపడి సంపాదించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలని సూచించారు. డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించడంలో పోలీస్ వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం అందించి భాద్యతగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, 1టౌన్ సీఐ కరుణాకర్, కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ