తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం , చుంచుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంతోటి.పాల్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్నతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతా రాములు మాట్లాడుతూ క్రిస్మస్ అనేది యేసు క్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన పండుగని ఇది ప్రేమ, శాంతి, దయ వంటి విలువలను మనకు తెలియజెస్తుందని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి అనే గొప్ప సందేశాన్ని క్రిస్మస్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, సుజాతనగర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగుల.అర్జున్ రావు, గడిపల్లి. కవిత, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్, జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ