తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీజేపీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులఎన్నికల ప్రక్రియ లో భాగంగా జిల్లా కార్యాలయం లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ మౌళి జిల్లా లోని అధ్యక్షులకు మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లకు పోటీ పడే వారి నుండి నామినేషన్ లు స్వీకరించారు నామినేషన్ లు వేసిన వారిలో మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత జిల్లా అధ్యక్షులు KV రంగాకిరణ్,సీనియర్నా యకులు భూక్యా సీతారామ్ నాయక్, సోమసుందర్, ఆకుల నాగేశ్వరావు, శ్రీనివాస రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు నామినేషన్ వేసినారు అనంతరం జిల్లా రిటర్నింగ్ అధికారి రాజ మౌళి మాట్లాడుతు దేశంలో ఏ రాజకీయ పార్టీ లో లేని విధంగా ఒక్క బీజేపీ పార్టీ లోనే జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అన్నారు. పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కొన్ని సార్లు అనుకున్న పదవులు రాకున్నా కేవలం దేశం కోసం సమాజం కోసం పని చేసే నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు.బీజేపీ లో పని చేసే ప్రతి ఒక్కరికి మంచి భవిషత్ ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోడియం బాలరాజ్, ముస్కు శ్రీనివాస రెడ్డి, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, పైడిపల్లి రావేందర్, వెంకట్ రెడ్డి, ch శ్రీనివాస్, గాంధీ, శ్రీధర్, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ