Tuesday, 28 July 2026 01:26:23 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చారిత్రాత్మక వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 30 November 2025 11:12 AM Views : 211

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చారిత్రాత్మక వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై శనివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోపాలూ లేకుండా నిర్వహించేందుకు ప్రతి శాఖ అత్యంత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ స్పష్టం చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు ఐడిఓసి కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్‌లో హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుందని, హెలిపాడ్ పరిసరాల్లో గ్రీన్ రూమ్ వాహనం, భద్రతా చర్యలు, పరిశుభ్రత వంటి అంశాలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్టేట్ చాంబర్ వద్ద కూడా పరిశుభ్రతను నిర్ధారించి సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ శిలాఫలకం వద్దకు చేరుకునే వివిఐపీల రవాణా కోసం మినీ బస్సులు ఏర్పాటు చేసి, ఈ ప్రక్రియను పాల్వంచ తాసిల్దార్ పర్యవేక్షించాలని ఆదేశించారు. శిలాఫలకం వద్ద పూల అలంకరణ, గ్రీన్ మ్యాట్ ఏర్పాట్లు, వీఐపీల ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు ఉండేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాల ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సింగరేణి మైనింగ్ కాలేజ్ ఏర్పాటుతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందే వరకు జరిగిన చారిత్రాత్మక ఘట్టాలను ప్రతిబింబించేలా ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు కూడా ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో జరగాలని తెలిపారు. వీఐపీల స్వాగతం మరియు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనబోయే విద్యార్థులు, ప్రొఫెసర్లు ముందుగానే ఖరారుచేయాలని సూచించారు. ఉదయం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. అగ్నిమాపకశాఖ తగిన సంఖ్యలో ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు హెలిపాడ్, కాన్వాయ్ మార్గం, సభా ప్రాంగణం వద్ద అంబులెన్స్ సేవలు, అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతర్గత రహదారుల మరమ్మత్తులు, అకాడమిక్ బ్లాక్ భవనాల వైట్‌వాష్ వంటి మౌలిక పనులను పంచాయతీ శాఖ అత్యవసరంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. రహదారులు, వేదిక, సౌండ్ సిస్టమ్ వంటి పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆర్అండ్‌బి శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ అధికారులు సభా ప్రాంగణం, గ్యాలరీలలో తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ జనరేటర్లు మరియు నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలు మరియు విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడపాలని సూచించారు. ఇంటర్ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నిక్, అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు సభలో విచ్చేలా రవాణా శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు భోజన సదుపాయం మహిళా సంఘాల సభ్యుల సమీకరణ పర్యవేక్షించాల్సిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనను ఆదేశించారు. సభా ప్రాంగణం వద్ద పుట్టగొడుగుల పెంపకం, సోలార్ డ్రైయర్, లైవ్లీహుడ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అనుమతులు రేపటి కల్లానే పూర్తిచేయాలని, డిసెంబర్ 1 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రోటోకాల్ అమలు, వీఐపి ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షణలో వ్యవహరించాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్, ఎస్పీ, అధికారులు కలిసి శిలాఫలకం పరిసరాలు, సభా ప్రాంగణం, వేదిక, రవాణా మార్గాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి, తగిన సూచనలు జారీ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి పర్యటన ఓ కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ పర్యటనను ఘనవిజయవంతం చేయడానికి శాఖలు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ , రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకుగాను భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమం మొత్తం ప్రోటోకాల్‌కు పూర్తిస్థాయిలో అనుగుణంగా సాగేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని విభాగాల సమన్వయంతో బలమైన భద్రతా ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొన్నారు. సీఎం కాన్వాయ్ ఆగే ప్రతి స్థలం, మార్గమధ్య ప్రాంతాలు, సభా ప్రాంగణం, శిలాఫలకం వద్ద ఏర్పాటు చేసిన వేదికల వద్ద సిబ్బందిని తగిన బందోబస్తుతో మోహరించామని వివరించారు. అలాగే వీఐపీల రాకపోకలకు సంబంధించిన ప్రత్యేక వాహన పాసులు, వాహనాల నిల్వ, ప్రవేశ నియంత్రణ, గేటు నిర్వహణ వంటి అంశాలను ఖచ్చితమైన పరిశీలనతో అమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఇంటెలిజెన్స్ వింగ్, ట్రాఫిక్ వింగ్, లా అండ్ ఆర్డర్ విభాగాలు పరస్పరం సమన్వయంతో పని చేయనున్నాయని చెప్పారు. సభకు భారీగా వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే ప్రణాళిక చేసినట్టు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :