తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా మరియు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకే నామ్ ఏక్ పేడ్ అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు రైటర్స్ బస్తి కొత్తగూడెం గణేష్ దేవాలయంలో మొక్కలు నాటి గుడిని శుభ్రం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పివి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కని తమ ఇంటి ప్రాంగణంలో నాటి సంరక్షించే బాధ్యతని తీసుకోవాలని తెలియపరిచారు ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్ మరియు సీనియర్ నాయకులు నరేంద్ర బాబు, సత్యనారాయణ మరియు చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్ మరియు సతీష్ మరియు బండి వీరస్వామి మరియు భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ