తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ రోజు ములకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి మహిళా సాధికారత విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మొదటగా చౌటిగూడెం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి స్వయం సహాయక సంఘం మహిళల కోసం కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు అనంతరం ఒడ్డుగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.తరువాత పొగళ్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు అదే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు అనంతరం ములకలపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘం మహిళల కోసం నిర్మించనున్న రెండు కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా మరింత బలపడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన కుటుంబానికి చేరేలా అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘం మహిళలు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ