తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు ,కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ మూడు గణేష్ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీ, బాడ్మింటన్ క్లబ్ వేదికగా జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిసాయి. విజేతలకు బహుమతులను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ మోడు గణేష్ ప్రధానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రస్తుతం బ్యాడ్మింటన్ పట్ల యువత ఆసక్తి చూపుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రీడాకారులకు, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని టోర్ని నిర్వాహకులు ఇలాంటి పోటీలు మరిన్ని జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు యూసుఫ్,విజయకుమార్ , బాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవి కుమార్, ట్రెజరర్ కె రమేష్, ప్రోగామ్ చైర్మన్ గోనేల నాని, కమిటీ సభ్యులు జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు కరీంపాషా, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్ , ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ