Tuesday, 28 July 2026 02:32:18 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 16 April 2025 06:30 PM Views : 886

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా రహదారులపై ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన రహదారి భద్రత ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లాలో ఎక్కువ నిడివి కలిగిన జాతీయ రహదారులతో పాటు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రహదారులు ఉన్నాయని తెలిపారు. బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో రహదారి భద్రతపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ చికిత్స నిమిత్తం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తరఫున ప్రణాళిక రూపొందించాలని డీఎంహెచ్‌వో ను ఆదేశించారు. ముందుగా జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రహదారి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న గుర్తించిన ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు గల కారణాలపై అధ్యయనం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రాణాలు పోకుండా తక్షణమే ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్న దగ్గరి రహదారులు, హాస్పిటళ్లను ఎంపిక చేయాలని తెలిపారు. అదేవిధంగా అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రమాదాలు సంభవించకుండా రహదారులపై సైన్‌ బోర్డులతో పాటు, రేడియం స్టిక్కర్లు, జీబ్రాలైన్లు, స్టాపేజీలు వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో మోటార్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికిఅధికమవుతున్నాయన్నారు. వాహనాలు కండిషన్ గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జైలు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశంలో గుర్తించి వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని. కళాశాలలు మరియు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకుగాను ప్రమాద దృశ్యాల వీడియోలు మరియు ఫోటోలు ద్వారా ప్రమాదానికి గురైన వారి తల్లిదండ్రులు పడే వేదనను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. జిల్లాలోని రహదారుల్లో ప్రమాదకరమైన మలుపుల వద్ద అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలన్నారు. రహదారులు వెంట ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలోని ప్రధాన కూడళ్ళలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటుచేసిన పోల్స్ మాదిరిగానే జిల్లావ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల్లో ప్రమాదాల నియాత్రలకు అన్ని శాఖలు సమన్వయంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ఆర్ అండ్ బి ఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి,డి సి హెచ్ ఓ రవిబాబు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :