Tuesday, 28 July 2026 04:53:16 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆవాస విద్యాలయాల తనిఖీలో లోపాలపై ఆగ్రహం – ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీకి కలెక్టర్ ఆదేశం.

Date : 09 April 2026 04:35 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతకొత్తగూడెంలో ఉన్న సమగ్ర శిక్ష పరిధిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం, పట్టణ బాలుర ఆవాస విద్యాలయం (URS)లను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏడవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల ఇంగ్లీష్ పఠన సామర్థ్యాన్ని పరీక్షించిన కలెక్టర్, విద్యార్థుల ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు సరిగా చదవలేకపోవడానికి గల కారణాలపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన కలెక్టర్, బోధనలో లోపాలు ఎందుకు ఉన్నాయో వివరణ కోరారు. పట్టణ స్థాయి పాఠశాల అయినప్పటికీ విద్యార్థుల సామర్థ్యం తక్కువగా ఉండటం ఆందోళనకరమని తెలిపారు. స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, అవసరమైన సరుకులు తగినంతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరఫరాలో లోపాలు ఎందుకు ఉన్నాయో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అనంతరం కిచెన్‌ను పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత లోపాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ కాంట్రాక్టు పద్ధతిలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం పడకుండా బాధ్యతతో పని చేయాలని సూచించారు. ఈ పాఠశాలలో వీధి బాలలు, రక్షించబడిన బాలలు, డ్రాప్ అవుట్ బాలలు చదువుతున్నందున వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ అన్నారు . అయితే పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల నిర్వహణ, బోధన ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ రాంబాయి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :