Tuesday, 28 July 2026 11:45:57 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 04 June 2026 01:07 PM Views : 292

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతోందని తెలిపారు.గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేసే సమర్థవంతమైన వేదికలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు .రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పంటల దిగుబడులు పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు.గ్రామాల్లో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే అలవాటు ప్రతి కుటుంబం అలవరుచుకోవాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐఆర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను జాబితా నుండి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, రైతులు, గ్రామస్థులు పంట పొలాలకు వెళ్లే రహదారుల అభివృద్ధి, గ్రామంలోని విద్యుత్ అదనపు లైన్లు , అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటి కి ఆర్వో వాటర్ ప్లాంట్ ఎర్పాటు వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను వెంటనే చర్యలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామారావు, డి ఆర్ డి ఓ విద్యా చందన, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :