తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ హెడ్ ఆఫీస్ నందు సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు నీ మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందజేసిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రేణిగుంట్ల ప్రవీణ్ .ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ. సింగరేణిలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలపై ఈనెల అనగా అక్టోబర్ 23, 24, 25 తేదీలలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు " కమిషన్ సభ్యులందరం కలిసి రీజినల్ వైజ్ గా సింగరేణిలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని సింగరేణి డైరెక్టర్ (పా) కి వివరించడం జరిగినది. ఆ మీటింగ్ కు సంబంధించిన విధివిధానాలు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తాయని రేణిగుంట్ల ప్రవీణ్ తెలియజేసినారు. సింగరేణి డైరెక్టర్ (పా) ని కలిసిన వారిలో సింగరేణి క్యాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు, అసోసియేషన్ ట్రెజరర్ జిమ్మిడి మల్లేష్, అసోసియేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ బందెల విజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ