Tuesday, 28 July 2026 09:39:57 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

20న ఖమ్మం,భద్రాద్రి జిల్లాల బాక్సింగ్ టీమ్స్ ఎంపిక : బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్

Date : 15 July 2025 04:59 PM Views : 767

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వచ్చేనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లో జరగనున్న జాతీయ సబ్ జూనియర్స్ బాలురు, బాలికల పోటీలలో భాగంగా ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సబ్ జూనియర్స్ బాలురు, బాలికల బాక్సింగ్ టీమ్ లను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్ తెలిపారు. మంగళవారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన బాక్సింగ్ జిల్లా సర్వసభ్య సమావేశంలో కామేష్ మాట్లాడుతూ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్స్ 30కేజీల నుండి 70 కేజీల వరకు 15 విభాగాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్టు ఎంపిక చేసి జాతీయ సబ్ జూనియర్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున అర్హత కలిగిన బాక్సర్లు ఈనెల 20వ తేదీ ఆదివారం ఉదయం 8గంటల లోపు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో రెండు జిల్లాల బాక్సింగ్ క్రీడాకారులు వయస్సు నిర్ధారణ ధ్రువపత్రం తీసుకుని హాజరు కావాల్సిందిగా కోరారు. పూర్తి వివరాలకు కోచ్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ.ఈశ్వర్ కు సెల్ నెంబర్ 7893669676, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్ 9885442131, ఖమ్మం జిల్లా వివరాలకు మాలోత్ రాజా 9949083202 కు సంప్రదించాలని కోరారు. ఈకార్యక్రమంలో బాక్సింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డీ షమీఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివాసుబ్రమణ్యం, సీనియర్ బాక్సర్ మాలోత్ గౌతమ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :