తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం ఉదయం పిసికే-5 ఇంక్లైన్ లో పిట్ కార్యదర్శి హుమాయూన్ అధ్యక్షణ గేట్ మీటింగ్ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సంస్థకు నూతన బొగ్గు బ్లాకులు తీసుకొచ్చి సింగరేణి మనుగడను కాపాడాలని అన్నారు,కార్మికులకు సొంత ఇంటి పథకం అమలుచేసి ప్రతి కార్మికుడికి 30లక్షలు వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు,యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డాయి,అదేవిధంగా సంస్థ ప్రవేట్ పరం కాకుండా కాపాడుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు,మరియు కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెకు సైతం వెనకడబోమని స్పష్టం చేశారు,క్వాలిటీ బొగ్గు వచ్చే పీకే ఓసీ డీప్సైడ్ బ్లాక్ ను వేలంలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కరించాలని,సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పై నిన్న జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కార్మికుల సమస్యల పరిష్కారానికై మాట్లాడారని అన్నారు, సింగరేణి స్థితిగతులు, కార్మికుల సమస్యలపై ఎప్పుడూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు, ఈ కార్యక్రమం లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య,నాయకులు ఎస్ నాగేశ్వరరావు,కమల్, సాయి పవన్, భుక్య రమేష్,రామచందర్, క్రాంతి, రమణ,ఆకుల శ్రీనివాస్,సుమన్,మదనయ్య,ఇరప కృష్ణ,ధర్మ,శేషయ్య, దేవసింగ్,తాతిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ