తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. బెండలపాడులో పూర్తయిన 309 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారని చెప్పారు. అనంతరం దామరచర్ల గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఈ సందర్భంగా పరిశీలించారు. కార్య క్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్ మువ్వా విజయబాబు, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ