Tuesday, 28 July 2026 10:26:48 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

Date : 11 November 2025 05:14 PM Views : 350

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా పోలీసులు చేపట్టిన "చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం" కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో సుజాతనగర్ సెంటర్ నుండి లక్ష్మిదేవిపల్లి,ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు భారీ బైకు ర్యాలీని నిర్వహించడం జరిగింది.ముందుగా ఈ ర్యాలీని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన యువత పడకుండా,వారికి అవగాహన కల్పించడం,గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టడం వంటి కార్యక్రమాలను జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు.ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ,విక్రయిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని,అవసరమైతే పీడియాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఎస్పీ జెండాను ఊపి బైకు ర్యాలీని ప్రారంభించారు. 1000 మందికి పైగా ఈ ర్యాలీలో స్థానికులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి,సుజాతనగర్ ఎస్సై రమాదేవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :