Wednesday, 29 July 2026 05:48:40 AM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ .

Date : 27 July 2026 05:14 PM Views : 61

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాడు జిల్లా పోలీసు అధికారులతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన దర్యాప్తులో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి, సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి త్వరితగతిన ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా విచారణ చేపట్టాలని సూచించారు.పరారీలో ఉన్న నిందితులను గుర్తించి ప్రత్యేక బృందాల ద్వారా వెంటనే అరెస్టు చేయాలని, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై సమగ్ర ఆర్థిక దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ అందించడంతో పాటు డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి సబ్‌ డివిజన్ వారీగా డీ-అడిక్షన్ కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించి లక్ష్యాలను సాధించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో పనిచేయాలని, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, జిల్లాలోని సీఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :