తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ధీశాలి ఎన్టీఆర్. రూ. 2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలు చారిత్రాత్మకం.ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. పాతకోతగూడెంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి. సినిమా, రాజకీయ రంగాల్లో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ధీశాలి ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన రూ. 2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలు చారిత్రాత్మకమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు గురువారం పాతకొత్తగూడెంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ కలిసి అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తుచేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి పనిచేసిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, రామారావు, భవానీప్రసాద్, సాంబిరెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ