Tuesday, 28 July 2026 12:44:57 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక, విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 03 November 2025 05:47 PM Views : 358

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ వైద్య కళాశాలలో వైట్ కోట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక, విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలోనూతన వైద్య విద్యార్థులు (MBBS) వైద్య వృత్తిలో అడుగుపెట్టిన సందర్భంగా వైట్ కోట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక అని, ఇది కేవలం ఉద్యోగం కాదు ఇది సమాజానికి అంకితమైన పవిత్ర బాధ్యత అన్నారు. వైద్య విద్యార్థులు రోగుల పట్ల కరుణ, సహానుభూతి, అంకితభావం కలిగి పనిచేయాలి అని తెలిపారు. మీ చేతుల్లో సమాజ ఆరోగ్య భవిష్యత్తు ఉంటుందని, అత్యున్నత వైద్య నైతిక ప్రమాణాలను పాటిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి వైద్యుడి ధర్మం అని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణలో యువ వైద్యుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. మీరు రాబోయే రోజుల్లో దేశ వైద్య రంగానికి మూల స్తంభాలు అని, ఈ దశలోనే మీరు క్రమశిక్షణ, సమయపాలన, మానవతా దృక్పథం, ప్రజల పట్ల బాధ్యత వంటి విలువలను ఆచరించాలి అని నూతన విద్యార్థులకు సూచించారు. వైద్యునిగా సమాజానికి మీరు చేసే సేవే మీ గొప్పతనం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రోగులు అందరికీ గౌరవం ఇవ్వండి. ఈ వైట్ కోట్ కేవలం వస్త్రం కాదు ఇది నైతికత, సేవ, నిబద్ధతలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైద్య నైతిక ప్రమాణాల పట్ల నిబద్ధత వ్యక్తం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు.అనంతరం 150 మంది నూతన వైద్య విద్యార్థులకు కలెక్టర్ చేతులు మీదుగా తెల్లకోటును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీహరి రావు, కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాధామోహన్, వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :