తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థంగా గిట్టుబాటు ధరను కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. బానోత్ ఇస్రా నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి యాస నరేష్ మాట్లాడుతూ మండలంలోని అనేక మంది రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారని అన్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి శాశ్వత మార్కెట్ లేక దళారీలు తమ ఇష్ట రాజ్యంగా కొంటున్నారని అన్నారు. మార్కెట్ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేశారని గుర్తు చేశారు. దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్న నేటికీ శాశ్వత మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. శాశ్విత మార్కెట్ లేక రైతులు తమ పంటను అడిగిన రేటుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. జూలూరుపాడు చుట్టుపక్కల మండలాలు కూడా మండలంలోని ఉన్న మార్కెట్ వద్దకు వస్తున్నారని ఈ మార్కెట్ను శాశ్వత మార్కెట్ గా నిర్ణయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. మార్కెట్ ఏర్పాటు కోసం దశల వారి ఉద్యమాలు నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . ఏడాది రావలసిన రైతుబంధు కూడా ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో పడలేదని, సాగుకు కావలసిన డబ్బులు రైతుల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదని అని అన్నారు. తక్షణమే రైతు రుణమాఫీ రైతు బంధు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గడిదేసి కనక రత్నం, గార్లపాటి వెంకటి, వల్లమళ్ల చందర్ రావు, పద్దం సుగుణ, జల్లి రాధాకృష్ణ,తాటి పద్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ