Tuesday, 28 July 2026 08:12:24 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కారాదు - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 10 March 2026 01:10 PM Views : 194

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్తో కలిసి జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్‌సీవోలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యాసంస్థల్లో ఆహార భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులదేనని స్పష్టం చేశారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కలుషిత ఆహార ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు ఇంటి నుండి తీసుకువచ్చిన బిర్యానీ, మాంసాహార పదార్థాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కమిటీ సభ్యులు ముందుగా వండిన ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు వడ్డించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యమైనది, పరిశుభ్రమైనది, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శిస్తూ ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :