తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సురక్ష ఒకేషనల్ కళాశాల లో ఈరోజు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథి గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి విజయకుమారి వీచేశారు. పిల్లలతో ముచ్చటిస్తూ వైద్య శాఖలో నర్సింగ్ విద్యార్థులకి అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అలాగె గౌరవ అతిథిగా వీచేసిన షి టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ రామా దేవి విదార్థులలో ముచ్చటిస్తూ ఈ వయసులో ఉన్న పిల్లలు అందరూ చెడు అలవాట్లకి దూరం గా ఉండాలని సోషల్ మీడియా మరియు సైబర్ క్రైమ్స్ బారిన పడకూడదు అని బాగా చదువు కొని తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. ముఖ్య అతిధి గా వీచేసిన కళాశాల చైర్మన్ యెల్దండి రాము మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులకి నాణ్యమయిన ఉచిత విద్య ను అందించాలని సంకల్పంతో కళాశాలను స్థాపించానని చెప్పారు. మరియు 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మెమంటోస్ ప్రదానం చేసి అభినందించారు.అదే విధంగా కళాశాల ప్రిన్సిపల్ జి. రవికుమార్ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించి ఈ వేడుక విజయవంతం అవడానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరియు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు యెల్దండి వాసుదేవ రావు , యెల్దండి అఖిలేష్, అధ్యాపకులు, విద్యార్థులు, శ్రేయోభిలాషూలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ