తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 1 తెలుగు వెలుగు )చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987-1990 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన మలకం వెంకటేశ్వర్లు ఇటీవల అనంతారం గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో వెంకటేశ్వర్లు తో చదువుకున్న మిత్రులందరూ వెంకటేశ్వర్లు కుమార్తెల పేరుల మీద ఉన్నత చదువులు కొరకు రూ.60వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. మరియు భార్యకు 5000 రూపాయలు, 25 కేజీల బియ్యం మును అందజేశారు. అదేవిధంగా మరొక మిత్రుడు గుండెపుడి గ్రామానికి చెందిన చిలుకూరి పాపారావు అనారోగ్యం కారణంగా బాధపడుతున్నాడు అన్న విషయం తెలుసుకుని మిత్రుడు స్వగృహానికి వెళ్లి పరామర్శించారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు రమ్య కేబుల్ అధినేత నారా శ్రీను, సిరంశెట్టి రామారావు, వేల్పుల గోపాలకృష్ణ, కిషోర్, కృష్ణార్జునరావ్, జోగారావు, అను మల్ల శ్రీను, మంగమూడి నాగేశ్వరరావు, వెచ్చ రమేష్, గుమ్మడిదల శ్రీను, మద్దిబోయిన చిన్న వెంకటేశ్వర్లు, కట్రం స్వామి పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ