తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఈ నెల 21 నుంచి జరగనున్న పరీక్షల కోసం ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటన చేశారు. కాగా.. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పది పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు.
Admin
తెలుగు వెలుగు టీవీ