తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండల BLA2లు సమావేశం బేతాళ పాడులో జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పార్లమెంట్ కి పోటీ చేసిన తాండ్ర వినోద రావు విచ్చేసినారు. సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటరు సమగ్ర సవరణ సర్వేలో BLA 2 లు యాక్టివ్గా పనిచేయాలి. ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఫామ్స్ ఫిలప్ చేసి బి ఎల్ ఓ అధికారి కు అందచేయాలి. కొన్ని ప్రాంతాల్లో జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నవి, అలాంటి ఓట్లని గుర్తించాలి, ప్రతి ఓటర్ కి దేశంలో ఎక్కడైనా ఒకే చోట ఓటు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ సర్ మీద ఓటర్లు బైందోలన కలిగిస్తున్నది. దొంగ ఓట్లను ఏరువేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కూడా రోహన్యాలని దొంగ ఓట్లు వేరువేసినారు. నిజమైన ఓటరు ఉండటం వల్ల ప్రజాస్వామ్యం అక్కడ నిలబడినది. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని తాండ్ర వినోద రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఖమ్మం జిల్లా సర్ కన్వీనర్ భూక్య శ్యామ్ రాథోడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్, గుగ్లోత్ రాంబాబు, కృష్ణం శెట్టి గోపాలరావు, భుక్య రవి, నవీన్, వాసు, కర్నాటి వీరభద్రం, నరసింహారావు, బిఎల్ఎ టూ లు, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ