Tuesday, 28 July 2026 02:36:35 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అటవీశాఖ మహిళ ఉద్యోగిని పై దాడి చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

Date : 04 September 2025 08:15 PM Views : 802

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు రేంజ్ పరిధిలోని, పాపకొల్లు బీట్- బీ పరిధిలోగల రాసగానిగుట్ట కంపార్ట్మెంట్ నెంబర్ 31 ప్రాంతంలో,తేదీ 29.08. 2025న ఉదయం 11.00 గంటల సమయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన కొలిచలం విజయలక్ష్మి మరియు ప్లాంటేషన్ వాచర్ అయిన తేజావత్ రాము కలిసి విధులు నిర్వహిస్తుండగా, అట్టి ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మారుజాతి మొక్కలను నరికి వేసి ఉండడాన్ని గమనించినారు, అయితే అట్టి ప్రదేశము ఫారెస్ట్ కవర్ రేంజ్ పాయింట్ కనుక అట్టి ప్రదేశంలో మొక్కలు నాటవలసి యున్నది కనుక,పై అధికారుల ఆదేశానుసారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వాచర్ లు ఇద్దరు కలిసి మొక్కలు నాటుచుండగా, మొక్కలు నాటుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడి సీతారాములు,మడి ప్రవీణ్,మడి ముత్తమ్మ లు అచ్చటకు వచ్చి మొక్కలు నాటడానికి వీల్లేదు, ఇచట గుత్తి కోయలు ఇలానే చెట్లను నరికి సాగు చేసుకుంటారు, మీరు అడ్డు చెబితే మీ సంగతి చూస్తాం, మిమ్ములను చంపుతామంటూ బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి, మొక్కలు నాటకుండా అడ్డగించి, విధులకు ఆటంకం కలిగించినారని, పక్కనే ఉన్న గుత్తి కోయ మహిళ అయిన మడివి హీడిమా ను రెచ్చగొట్టి, తనపై దాడికి ఉసిగొల్పినాడని, సదరు మహిళ రాయితో తన ను రెండు దెబ్బలు గట్టిగా కొట్టి ,జుట్టు పట్టుకొని లాగి కింద పడేసిందని, తమ వాచర్ వీడియో చిత్రీకరిస్తుంటే, వారంతా వాగు దాటి పారిపోయారని, కాసేపటికి బచ్చల నరసమ్మ అనే మహిళ కూడా తమ వద్దకు వచ్చి, దురుసుగా ప్రవర్తించి ,అసభ్య పదజాలంతో దూషించి, చంపుతా అంటూ బెదిరించినదని, అటవీ శాఖ వారి అనుమతి లేకుండా ,అటవీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, 15 వేల రూపాయల విలువ చేసే చెట్లను నరికి, పత్తి పంట సాగు చేసుకుంటూ, ఎందుకు ఇలా అనుమతి లేకుండా పంటలు వేశారని ప్రశ్నించినందుకు, తమను బూతులు తిట్టి రాళ్లతో కొట్టి గాయపరిచి, మొక్కలు వేయనీయకుండా తమ విధులకు ఆటంకం కలిగించి, మరో మారు తమను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన, మడి సీతారాములు, ప్రవీణ్, ముత్తమ్మ , హీడిమా, నరసమ్మలపై చట్టరీత్య చర్య కొరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొలిచలం విజయలక్ష్మి, భర్త పేరు మాధరావు, వయసు 30 సంవత్సరములు, అను ఆమె ఫిర్యాదు ఇవ్వగా, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :