Tuesday, 28 July 2026 12:30:04 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీ కి రాజకీయ పార్టీలు సహకరించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 11 August 2025 01:20 PM Views : 747

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీ తోపాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి వీణగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా సవరణలు, క్లైములు, అభ్యంతరాల పరిష్కారం మరియు అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పు వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఆ మేరకు ప్రతినెలా గుర్తింపు పొందిన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు చురుగ్గా ఉండి వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అంశాన్ని ఏమైనా ఉంటే వాటిని సమావేశంలో తెలియజేయాలన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిదిద్దడం వలన స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందని అన్నారు. ప్రతి బిఎల్ఓ కు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను తప్పనిసరిగా నియమించాలని, రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలు లో మౌలిక సదుపాయాలు కల్పన, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని తద్వారా వాటిని పరిష్కరిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కు పొందవచ్చని, ఇందుకోసం ఇందుకోసం వారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆ దిశగా రాజకీయ పార్టీలు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ,ఎలక్షన్ సెల్ సూపర్డెంట్లు , ముజాహిద్,రంగ ప్రసాద్ ,భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ నోముల రమేష్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ అగర్వాల్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అన్నవరపు సత్యనారాయణ, కమ్యూనిస్టు పార్టీ ఇండియా శ్రీనివాస్, ఆమ్ ఆఫ్ ది పార్టీ రాంబాబు, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :