Tuesday, 28 July 2026 04:17:56 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నకిలీ రిపోర్టర్ల పై చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ కి కొత్తగూడెం జర్నలిస్టుల వినతి

Date : 30 December 2024 07:19 PM Views : 1068

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిపోర్టర్లమంటూ చలామణి అవుతున్న నకిలీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారికి కొత్తగూడెం జర్నలిస్టులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఇటీవల కాలంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు యూట్యూబ్, పిడిఎఫ్,నాన్ రికగ్నైజ్డ్ పత్రికలు వంటి సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకొని రిపోర్టర్లంటూ ముసుగు ధరించి తిరుగుతూ వ్యాపారస్తులు,కాంట్రాక్టర్లు,సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పట్ల దృష్టి సారించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కోరారు.అదేవిధంగా జిల్లా ప్రెస్ క్లబ్ పేరుతో ఈ నకిలీ విలేకరులు వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. ఇకపై నకిలీ రిపోర్టర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.నిజమైన జర్నలిస్టులు ఆధారపురితంగా అవినీతి,అక్రమాలపై వార్తా కథనాలు ప్రచురించి సమాజానికి మేలు చేసేవారని,కానీ కొందరు నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇకపై ఎవరైనా అనుమతి లేని యూట్యూబ్, పిడిఎఫ్, నాన్ రికగ్నైజ్డ్ పత్రికల పేర్లతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఇమంది ఉదయ్ కుమార్,పండుగ రేశ్వంత్,చావా పాపారావు,దాట్ల రవీందర్ నరసింహారావు,ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :