Tuesday, 28 July 2026 02:44:50 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అందుబాటులోకి భద్రగిరి మార్ట్ ...! ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్, హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Date : 28 March 2026 07:19 PM Views : 184

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : స్థానికుల ప్రయోజనార్థం ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ కృషి తో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శనివారం ఈ మార్టును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్ట్ లోని అటవీ ఉత్పత్తులను గవర్నర్ పరిశీలించారు. ప్రజా ఉపయోగకర అనేక అటవీ వస్తువులను ఈ మార్ట్ లో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, ఇవి ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తాయని ఇందుకు కృషి చేసిన ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ మార్టును స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే ట్రైబల్ మ్యూజియం వంటి వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు పొందిన పిఓ రాహుల్ భద్రగిరి మార్ట్ అందుబాటులోకి తేవడంతో మరో మైల్ రాయిగా నిలుస్తుందని, గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం, అలాగే వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, భద్రాచలం ప్రజలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, గిరిజన ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :