Tuesday, 28 July 2026 08:11:27 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 01 August 2025 06:18 PM Views : 826

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన TGWSW ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ మరియు AHTU కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సందర్శించారు. ముందుగా షీ టీం మరియు AHTU కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.మహిళలపై లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్ మరియు ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి కి పిలిచి వారి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.బాలికలకు,మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్స్ ను సంప్రదించాలని తెలియజేసారు.జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో,రైల్వేస్టేషన్,బస్టాండ్లు మరియు కళాశాలల వద్ద షీ టీమ్స్ సభ్యులు నిరంతరం సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలను నిరోధిస్తూ మహిళలకు అండగా నిలవాలని సూచించారు.మానవ అక్రమ రవాణా చేసి వారి అవయవాలను విక్రయించడం,వారితో వెట్టిచాకిరీ చేయించడం,వ్యభిచారంలోకి లాగడం,బాల్య వివాహాలు చేయడం లాంటివి జరగకుండా AHTU సిబ్బంది భాద్యతగా పనిచేయాలని సూచించారు.ఇటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి నిరంతరం జిల్లా మొత్తం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.మఫ్టీ దుస్తులలో సంచరిస్తూ నేరాలు జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలలో AHTU మరియు షీ టీం సిబ్బంది నిరంతరం సంచరిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సీఐ రాము,ఏఎస్సై నాగయ్య,మరియు షీ టీం సభ్యులు మల్లికాంబ,రాంబాబులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :