తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం 21.07.2025 న బోనాల ( పండుగ ) సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల (పండుగ) ఉన్నందున ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా గిరిజన దర్బార్ రద్దు చేయడం జరిగిందని, గిరిజనులు ఇట్టి విషయాన్ని గమనించి అర్జీలు సమర్పించడానికి భద్రాచలం లోని ఐటీడీఏ కార్యాలయంకు రావొద్దని ఆయన తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ