తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణవేత్త, జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు, కృత్రిమ అడవి సృష్టికర్త, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పై దుండగులు దాడి చేయడాన్ని కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం సభ్యులు, ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలో తన సొంత 70 ఎకరాల వ్యవసాయ భూమిని గత 40 ఏళ్లుగా కృత్రిమ అడవిగా తీర్చిదిద్ది, ప్రకృతికి ఎనలేని సేవ చేస్తున్న సత్యనారాయణ పై, గురువారం కొందరు దుండగులు అడవిలోకి చొరబడి చెట్లు నరకడం, మేకలను మేపడం చేస్తుండడంతో ఆయన మందలించాడనే కారణంతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిని ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం మొక్కల వెంకటయ్య ఇంటి వద్ద సమావేశమై, నిరసనను తెలియజేశారు. వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను నిమ్స్ లో చేర్పించి ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రకృతి ప్రేమికుల పైన ఇలాంటివి జరగకుండా, అటవీ ప్రకృతి పర్యావరణ చట్టాల ప్రకారం చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిని ఖండించిన వారిలో ప్రకృతి ఆశ్రమం గౌరవాధ్యక్షులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య, పర్యావరణ వేత్త మొ క్కల వెంకటయ్య, ప్రకృతి ఆశ్రమం కో_ఆర్డినేటర్ జి సుగుణారావు, మన్ కి బాత్ మొక్కల రాజశేఖర్, రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముస్తఫా, చిన్నారి ప్రకృతి ప్రేమికురాలు నైనిక రజ్వా, శంకర్, సాగర్, లక్ష్మి, దశరథ్ రజ్వ, శోభారాణి, ఝాన్సీ, రమేష్, భద్ర, అలెక్స్ లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ