తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలకు కుట్టు మిషన్లు, బాలికలకు సైకిళ్ళ పంపిణీ. స్థానిక పాల్వంచ పట్టణంలోని 42వ డివిజన్లో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, మహిళలకు టైలరింగ్ యూనిట్లను జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా ప్రారంభించడం జరిగింది. డివిజన్ పరిధిలో పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికల కోసం సైకిళ్ల పంపిణీ, అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం టైలరింగ్ యూనిట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించారు.బాలికల విద్యను ప్రోత్సహించడం, మహిళా సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రత్యేక పని చేయాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, అన్ని శాఖల సమన్వయంతో మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, మహిళా సాధికారికత కేంద్రం అన్ని వేళలో క్షేత్రస్థాయిలో ఉన్న మహిళలకి వారి ఆర్థిక పురోగతి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో మహిళలకు మనో ధైర్యం కల్పించాలని, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై కూడా మరింత అవగాహన కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి జే స్వర్ణలత లేనినా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ డి. మణి, మహిళా సాధికారిత కోఆర్డినేటర్ సంతోష రూప మరియు సిబ్బంది సౌజన్య, జహీదా, డివిజన్ నాయకులు, స్థానిక మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ