తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చంద్రుగొండ ఫారెస్ట్ రేంజ్ అధికారిణిగా కె. తేజస్వి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీనివాసరావు మేమోరియల్ ఫారెస్ట్ ట్రైనింగ్ కళాశాలలో విధులు నిర్వహించిన ఆమెకు పదోన్నతి లభించడంతో చంద్రుగొండ ఫారెస్ట్ రేంజ్ అధికారిణిగా నియామకం జరిగింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అటవీ సంపదను కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ లక్ష్మీపతి, సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్ మదన్‌లాల్, డి. నరసింహారావు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ