Tuesday, 28 July 2026 05:10:32 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కారు: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

Date : 01 September 2025 06:08 PM Views : 554

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం ప్రగతి మైదానంలోని అమరవీరుల స్థూపం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం సీతాలక్ష్మి మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పేరుతో గత ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై అసెంబ్లీలో చర్చకు పిలిచి మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలను పదేపదే అడ్డుకున్నారని తెలిపారు. ఘోష్ కమీషన్ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అది కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా సిద్ధం చేసుకున్న నివేదిక అని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణ కరువు ప్రాంతానికి నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. అలాంటి అపర భగీరథుడిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం లేని మంత్రులు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ.. సభాకాలాన్ని వృధా చేసి సభను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేశారు. రూ. 87 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రసాద్, తొగరు రాజశేఖర్, మునీర్, మాధవి, రామిళ్ళ మధు, పూర్ణచందర్ నాయక్, హనుమంతరావు, పోతురాజు రవి, రాజమౌళి, సాంబశివరావు, బి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, షారుక్, రిజ్వాన్, యాకూబ్ పాషా, రెహమత్, ఆర్ శ్రీనివాస్, షణ్ముఖ సాయి, కాపు నవనీత్, హాసిఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :