తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నికర లాభం ప్రకటించి వెంటనే 35% వాటా ఇవ్వాలని హైదరాబాదులోని సింగరేణి భవన్ ముట్టడి చేసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి,ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ. ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4701కోట్లలో 33% ఇస్తామని ప్రకటన చేస్తూ2289 కోట్లను పక్కనపెట్టి 2412కోట్లను మాత్రమే పచoడం జరిగింది. 2412 కోట్లలో 33%పంచాగా 67%మరల సింగరేణి సంస్థ డెవలప్ మెంట్ కొరకే పక్కన పెట్టారు. ఈ లెక్కన చుస్తే 16.9%మాత్రమే పంచారు. గత 12సంవత్సరాలనుండి టీబీజీకేఎస్ రికేజీనైజ్ యూనియన్ ఉన్నప్పుడు 16%నుండి 32%వరకు నికర లాభం లో పంచడం జరిగింది. కానీ ఇప్పుడు తక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా యాజమాన్యం నడుచుకోవడం జరుగుతుందన్నారు. అందుకనే గత సంవత్సరం యొక్క ఆడిట్ షీట్ను ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్ ) నాయకులు ఆరోపించారు. ఈ సంఘం సమావేశం లో వారు మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్న సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరానికి వచ్చిన వాస్తవ లాభాలను తెలియపరచకపోవడం దుర్మార్గమని, గతoలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరిగినప్పటికీ వాస్తవ లాభాలను తెలియపరచక పోవడం పలు అనుమానాలతో పాటు భారీ ఎత్తున కుట్ర జరుగుతుందని భావించవచ్చన్నారు వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు క్రిందకు వచ్చే పరిశ్రమలు, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ పరిశ్రమ ఉత్పత్తి, ఉత్పాదకత ల లాభ నష్టాలను తెలియపరచాల్సి ఉంటుందని, కానీ సింగరేణిలో విచిత్రం. ఏమిటంటే ఆరు నెలలు గడిచిన వాస్తవాలను ప్రకటించకపోవడం వింత ప్రక్రియగా మిగిలిపోయిందన్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చిన నికర లాభాలను ప్రకటించకుండానే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి, నిధులను యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలు పక్కన పెట్టి ప్రకటిస్తున్నదన్నారు. రెండు రోజులు క్రితం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల గాను 146.70 కోట్ల రూపాయలను సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అంతేకాకుండా సిఎస్ఆర్ నిధుల కింద సింగరేణికి సంబంధంలేని సివిల్ ప్రిపేర్ అభ్యర్థులకు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు కోట్లాది రూపాయలను నిబంధనలు విరుద్ధంగా ప్రకటించడం జరిగినదని. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25) సుమారుగా అక్షరాల 6400 కోట్ల రూపాయలు పైన లాభాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కావున యాజమాన్యం వెంటనే ఈ వాస్తవ లాభాలు ప్రకటించి నికర లాభాల నుంచి ఎటువంటి కటింగ్ లేకుండా 35 శాతం లాభాల వాటను వెంటనే ప్రకటించి సత్వరమే ఉద్యోగులకు అందజేయాలని అలాగే దసరా సెలవు అక్టోబర్ రెండో తారీకు నుంఛి మూడో తారీకు కు మార్చాలని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్రం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు, ప్రెసిడెంట్ మిర్యాల రాజు రెడ్డి గారు,ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు 19-09-25న హైదరాబాద్ నగరంలోని సింగరేణి భవన్ ను ముట్టడించి మెమొరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రకటన చేయకపోతే జి ఏం ఆఫీస్ ల ముందు బతుకమ్మల ను ఆడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి యాజమాన్యానికి నిరసన తెలియజేస్తామని కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ధర్నా కార్యక్రమం కు బయలుదేరి వస్తున్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ అదే విదంగా మా నాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. ప్రజల పాలనంటారు . ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అరెస్టులను ఎదుర్కోవడం జరిగింది అరెస్టులకు భయపడేది లేదు అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, కొత్తగూడెంఏరియా ఉపాధ్యక్షులు గడప రాజయ్య,, 11 ఏరియాల వైస్ ప్రెసిడెంట్ లు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, బ్రాంచ్ సెక్రటరీలు, పిట్ సెక్రటరీలు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సింగరేణి భవన్ ముందు ధర్నాను విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ