తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవీ విరమణ ఆత్మీయ సన్మానం అనేది మరింత బాధ్యత పెంచుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఉన్నందాసు గడ్డలో శాఖ 1 ,శాఖ 2 ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆత్మీయ పదవి విరమణ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సిపిఐ ప్రజా ప్రతినిధులకు పదవులతో సంబంధం లేదని, పదవి ఉన్నా ,లేకున్నా ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసమే కొట్లాడుతూ నిరంతరం పనిచేస్తుంటారని విరమణ అనేది ఉండదని ప్రజా సమస్యలు ఉన్నంతవరకు సిపిఐ ప్రజాప్రతినిధులు పనిచేస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. 10, 11 వార్డుల కౌన్సిలర్లుగా అనునిత్యం ప్రజల్లో ఉండి, మీ ఆదరాభిమానాన్ని పొందడం మీరు సిపిఐని వరుసగా మూడుసార్లు ఆదరించడం ,గర్వించదగ్గ విషయమని ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా సిపిఐని ఆదరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విరు ప్రజాప్రతినిధులుగా మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి సహకారంతో వారి శక్తి వంచన మేరకు కృషి చేశారని తెలిపారు. ఇంకా చేయవలసిన ప్రజా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని ,వాటి సమస్య సాధన కోసం ప్రజలు నిరంతరం నాయకత్వ అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు .అనంతరం బస్తీ వాసులు, స్నేహితులు 10 వార్డు కౌన్సిలర్ దంపతులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, 11 వార్డు కౌన్సిలర్ దంపతులు భూక్య శ్రీనివాస్ దేవిల ను సాబీర్ పాష చేతుల మీదుగా శాలువాతో ,పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉన్నం దాస్ గడ్డ శాఖ వన్ కార్యదర్శి సూరీమేని జనార్ధన్ ఉన్నం దాస్ గడ్డ 2 శాఖ కార్యదర్శి ఎస్కే జలీల్, సహాయ కార్యదర్శులు బానోత్ చందర్, గుగులోతు శంకర్, తోగరు నరేందర్, భూక్య మహేష్ లు ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పల్లబోతు సాయి ,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా నాయకురాలు రత్నకుమారి ,షాహిన్, విజయలక్ష్మి ,ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఖయ్యూం, రసూల్ దిలీప్, బానోత్ శ్రీనివాస్ నాయక్ ,సిపిఐ సీనియర్ నాయకులు కడారి మల్లేష్, కట్ట సత్యనారాయణ ,ఆది మల్లయ్య ,ఎస్కే నాగుల్ మీరా, సలీం, పూర్ణ, హరి, మహిళలు భానోత్ జానకి, కమల ,కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ