తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు సోమవారం పాల్వంచ రూరల్ ఎస్సై బి. సురేష్ మండల పరిధిలోని రేగులగూడెం, మామిడిగూడెం గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై మావోయిస్టు కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులకు సహకరించవద్దని, అందరూ ప్రశాంతంగా జీవించాలని ఎస్సై సురేష్ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ