తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, జిల్లా అధికారుల సముదాయం నవభారత్ పాల్వంచ. డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిది లోని ఇందిరా నగర్ ఉపఆరోగ్య కేంద్రం వికలాంగుల కాలనీ నందు కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం నందు జరుగుతున్న సర్వే ను పరిశీలించారు. ఈ రోజు వరకు జిల్లాలో 1, 407మంది ఆశాలు పాల్గొనగా, 89,545 ఇండ్లను సందర్శించి 3,11,165 మందిని పరీక్షించి 733మంది అనుమానితులను గుర్తించారు. వారిలో 254మందిని పరీక్షలు చేయగా కుష్ఠు వ్యాధి లేదని తెలియజేసారు. తరువాత కొత్తగూడెం ధర్మల్ కేంద్రం పాల్వంచ నందు జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ జ ఆధ్వర్యంలో CPR (Cardio Pulmonary Resuscitation)CPR చేసే విధానం (పెద్దల కోసం – Adult CPR), స్టెప్ 1: Chest Compressions (ఛాతీ ఒత్తిడి), వ్యక్తిని వెనుకకు పడుకోబెట్టాలి.ఛాతీ మధ్య భాగంలో (రెండు నిప్పుల మధ్య).రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టాలి.గట్టిగా, వేగంగా నొక్కాలి. వేగం: నిమిషానికి 100–120 సార్లు, లోతు: సుమారు 5–6 సెం.మీ. 30 సార్లు నొక్కాలి.స్టెప్ 2: Breathing (శ్వాస ఇవ్వడం).ముక్కు మూసినోరు నోరుకు పెట్టి 2 శ్వాసలు ఇవ్వాలి. శ్వాస ఇవ్వడం రాకపోతే, కేవలం ఛాతీ ఒత్తిడి (Hands-only CPR) కూడా సరిపోతుంది.స్టెప్ 3: 30 : 2 విధానం 30 ఛాతీ ఒత్తిళ్లు శ్వాసలుఇలా అంబులెన్స్ వచ్చే వరకు లేదా వ్యక్తి స్పందించే వరకు కొనసాగించాలి. పిల్లలు / శిశువులకు (సంక్షిప్తంగా) ఒక చేతితో లేదా రెండు వేళ్లతో ఒత్తిడి, ఒత్తిడి తక్కువ లోతుగా చేయాలి. శ్వాసలు మృదువుగా ఇవ్వాలి. CPR చేయకూడని పరిస్థితులువ్యక్తి సాధారణంగా శ్వాస తీసుకుంటుంటేస్పష్టమైన మరణ లక్షణాలు ఉంటే ముఖ్యమైన సూచనలు CPR ఆలస్యం చేయకూడదు.తప్పుగా చేసినా చేయకపోవడం కన్నా చేయడం మేలుసరైన శిక్షణ ఉంటే మరింత మంచిది అని అవగాహన కల్పించారు.ఫుడ్ సేఫ్టీ ధ్రువీకరణ పత్రాలు కూడా పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమం నందు, DR బానోత్ ప్రసాద్ ,DR మధువరుణ్ DPMO మోహన్ కేటీపీస్ రక్షణ దళం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ